Santhanuthalapadu: సంతనూతలపాడు వద్ద మాగాణిని తలపిస్తున్న ప్రధాన రహదారి!
Santhanuthalapadu: సంతనూతలపాడు పెదగచ్చులు బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు భారీ వర్షానికి మాగాణిని తలపిస్తోంది. గుంతల్లో నీరు చేరి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Santhanuthalapadu: సంతనూతలపాడు వద్ద మాగాణిని తలపిస్తున్న ప్రధాన రహదారి!
సంతనూతలపాడు: సంతనూతలపాడు సమీపంలోని ఒంగోలు కర్నూలు రహదారిలోని పెదగచ్చులు బ్రిడ్జి డైవర్షన్ రోడ్డు మాగానిని తలపిస్తున్నది.
శుక్రవారం నాడు కురిసిన భారీ వర్షాలకు గుంటలమయంగా నెలకొన్న డైవర్షన్ రోడ్డు లో నీరు నిలిచి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్యంగా డైవర్షన్ రోడ్డు ఒక పక్క గుంటలమయం మరొకపక్క నీటితో బాగా అక్కడ నిండిపోవడంతో వాహనదారులు ఇక్కట్లు చెప్పరాని స్థితికి చేరు కొన్నది.
రామతీర్థం గ్రానైట్ వాహనాలు హెవీ లోడ్స్ వల్ల డైవర్షన్ రోడ్డు రోజురోజుకు దెబ్బ తింటున్నది. వర్షం పడితే చిత్తడి చిత్తడిగా మారిపోతున్నది.
బ్రిడ్జి నిర్మాణం ప్రారంభించి చాలా నెలలు గడిచినను నేటికీ పూర్తి కాకపోవడంతో వాహనదారులు ఇదేమి కర్మ అంటూ వాపోతున్నారు.
ముఖ్యంగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయి ముగింపు పనులు ఆర్ .అండ్ .బి. శాఖ, కాంట్రాక్టర్ మధ్య వివాదం వల్ల సుమారు నెల రోజులు పాటు ఆగిపోయినవి.
దీనిపై పలు పర్యాయములు పత్రికల్లో వార్తలు రాయడంతో ఆర్ అండ్ బి శాఖ స్పందించి సదరు కాంట్రాక్టర్ తో మాట్లాడి పనులను ఇటీవలే మరలా ప్రారంభింప చేశారు. డైవర్షన్ రోడ్డుకు మరమ్మతులు చేపడితే గాని వాహనదారులు ఇబ్బందులు తగ్గవు.
ఇకనైనా ఆర్. అండ్. బి. శాఖ స్పందించి బ్రిడ్జి నిర్మాణాన్ని సత్వరమే పూర్తి చేయించి బ్రిడ్జి ప్రారంభానికి చర్యలు చేపట్టాలని వాహనదారులు కోరుతున్నారు.




