Podili: పొదిలిలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు!
Podili: పొదిలి మున్సిపాలిటీలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ప్రతిభ కనబరిచిన వారిని సన్మానించారు.
Podili: పొదిలిలో పారిశుధ్య కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు!
Podili: స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా పొదిలి మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికులకు వైద్య పరీక్షలు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కార్మికుల ఆరోగ్య పరిస్థితులను వైద్యులు పరిశీలించారు.
అనంతరం పారిశుధ్య నిర్వహణలో మెరుగైన పనితీరు కనబరిచి, విధుల పట్ల అంకితభావంతో సేవలందించిన ముగ్గురు పారిశుధ్య కార్మికులను అధికారులు సన్మానించారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ్మోహన్ మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులు తమ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండాలని, విధి నిర్వహణలో తగిన జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సూచించారు.
కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన వైద్య సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాసరావు, స్వర్ణ వార్డు అధికారి సువార్త, వైద్యులు శరత్ చంద్ర, శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతి తదితరులు పాల్గొన్నారు.




