Prakasam: వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ మృతి పట్ల సజ్జల దిగ్భ్రాంతి!

Prakasam: ஒంగోలులో వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ మృతిపై సజ్జల రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు.. పోలీసుల తీరు వల్లే రాజశేఖర్ మరణించారంటూ ఆరోపణ.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 25 Sept 2026 12:18 PM IST
Prakasam
X

Prakasam: వైఎస్సార్‌సీపీ నేత కాకుమాను రాజశేఖర్ మృతి పట్ల సజ్జల దిగ్భ్రాంతి!

Prakasam: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచార విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ ఆకాల మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఒంగోలు క్లౌపేటలోని రాజశేఖర్ స్వగృహానికి వెళ్లిన సజ్జల.. ఆయన భౌతికకాయానికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను పరామర్శించారు.

డీఎస్సీలో జరిగిన అక్రమాలపై షాప్ కార్యాలయం వద్ద వైసీపీ చేపట్టిన కార్యక్రమంలో పోలీసులు వ్యవహరించిన తీరుతోనే రాజశేఖర్ మృతి చెందారని సజ్జల ఆరోపించారు. తప్పు జరిగితే ప్రశ్నించడాన్ని కూడా ప్రభుత్వం నేరంగా పరిగణిస్తోందని విమర్శించారు. డీఎస్సీలో జరిగిన తప్పులను సరిదిద్దుకోకుండా వైసీపీని ఇబ్బంది పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు.

పోలీసులను అడ్డుపెట్టుకుని ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో వ్యవహరిస్తోందని సజ్జల ఆరోపించారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలను వైసీపీ ఆధారాలతో సహా ప్రశ్నిస్తున్నప్పటికీ.. ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాకుమాను రాజశేఖర్ మృతికి వైసీపీ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేసి నివాళులర్పించారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.