Podili: పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలాల పరిశీలన!

Podili: పొదిలి ఆర్టీసీ బస్టాండ్ వెలుపల ఖాళీ స్థలాలను ఆర్టీసీ పీఓ శ్రీనివాసరావు పరిశీలించి, అదనపు ఆదాయం కోసం వాటిని వినియోగించే చర్యలపై అధికారులతో చర్చించారు.

MADARVALI, MARKAPURAM
Published on: 30 Sept 2026 5:01 PM IST
Podili
X

Podili: పొదిలి ఆర్టీసీ బస్టాండ్ ఖాళీ స్థలాల పరిశీలన!

Podili: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌ వెలుపల ఖాళీగా ఉన్న వ్యాపార స్థలాలను ఆర్టీసీ పీఓ శ్రీనివాసరావు పరిశీలించారు. ఆర్టీసీకి అదనపు ఆదాయం సమకూర్చే విధంగా ఖాళీ స్థలాలను వినియోగించుకునేందుకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.

ఖాళీ స్థలాల్లో ఏయే వ్యాపారాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉంటాయో వ్యాపారులు స్థానిక డీఎంకు ప్రతిపాదనలు సమర్పించాలని సూచించారు. వచ్చిన ప్రతిపాదనలను పరిశీలించి, నిబంధనల ప్రకారం టెండర్లు నిర్వహించి అర్హులకు స్థలాలను కేటాయిస్తామని పీఓ శ్రీనివాసరావు తెలిపారు.

ఆర్టీసీకి చెందిన ఖాళీ స్థలాలను గుర్తించి, వాటి వివరాలతో నివేదికను సిద్ధం చేసి ఉన్నతాధికారులకు సమర్పించనున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM