Ardhaveedu: పీఎంజేజేబీవై బీమాతో బాధితురాలికి రూ.2 లక్షల సాయం

Ardhaveedu: అర్ధవీడులో గుండెపోటుతో మరణించిన రామారావు నామినీ తిరుపతమ్మకు పీఎంజేజేబీవై పథకం కింద రూ.2 లక్షల బీమా మొత్తం ఖాతాలో జమ కాగా అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

Srikanth Singam, Markapur
Published on: 3 Nov 2026 4:51 PM IST
Ardhaveedu
X

Ardhaveedu: పీఎంజేజేబీవై బీమాతో బాధితురాలికి రూ.2 లక్షల సాయం

మార్కాపురం జిల్లా: అర్ధవీడు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ద్వారా అర్ధవీడు గ్రామానికి చెందిన భయముతుకుల తిరుపతమ్మకు రూ.2 లక్షల బీమా మొత్తం అందింది. ఆమె భర్త భయముతుకుల రామారావు (42) గుండెపోటుతో మరణించగా, ఆయన బ్యాంకు ఖాతాలో ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం మంజూరైంది.

ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అర్ధవీడు శాఖ మేనేజర్ సి. సురేంద్రబాబు, కంభం ఎస్‌ఎస్‌టీ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ సహకారంతో బీమా క్లెయిమ్ ప్రక్రియ పూర్తిచేసి, నామినీ తిరుపతమ్మ ఖాతాలో నగదు జమ చేశారు.

ఈ మొత్తాన్ని తన కుమారుడి చదువుకు, కుటుంబ అభివృద్ధికి వినియోగించుకుంటానని తిరుపతమ్మ తెలిపారు. సహకరించిన బ్యాంకు మేనేజర్ సి. సురేంద్రబాబు, కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి. అశోక్ కుమార్, కౌన్సిలర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur