Ardhaveedu: పీఎంజేజేబీవై బీమాతో బాధితురాలికి రూ.2 లక్షల సాయం
Ardhaveedu: అర్ధవీడులో గుండెపోటుతో మరణించిన మహిళ నామినీకి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY) కింద రూ.2 లక్షల బీమా పరిహారం నగదు ఖాతాలో జమైంది.
Ardhaveedu: పీఎంజేజేబీవై బీమాతో బాధితురాలికి రూ.2 లక్షల సాయం
మార్కాపురం: మార్కాపురం జిల్లా అర్ధవీడు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ద్వారా అర్ధవీడు గ్రామానికి చెందిన షేక్ తుపాకీ చాంద్‌కు రూ.2 లక్షల బీమా మొత్తాన్ని అందించారు. ఆమె కోడలు షేక్ తుపాకీ శంషాద్ (38) గుండెపోటుతో మరణించగా, ఆమె బ్యాంకు ఖాతాలో ఉన్న బీమా పథకం ద్వారా ఈ మొత్తం మంజూరైంది.
ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ అర్ధవీడు శాఖ మేనేజర్ సి. సురేంద్రబాబు, కంభం ఎస్‌ఎస్‌టీ ఆర్థిక అక్షరాస్యత కేంద్రం కౌన్సిలర్లు పందీటి అశోక్ కుమార్, డోలు ఉదయ్ సహకారంతో బీమా క్లెయిమ్ ప్రక్రియ పూర్తిచేసి, నామినీ ఖాతాలో నగదు జమ చేశారు.
ఈ మొత్తాన్ని మనవడి చదువుకు, కుటుంబ అభివృద్ధికి వినియోగించుకుంటానని షేక్ తుపాకీ చాంద్ తెలిపారు. సహకరించిన బ్యాంకు మేనేజర్, ఆర్థిక అక్షరాస్యత కేంద్రం ప్రాజెక్ట్ డైరెక్టర్ వి. ఆంజనేయులు, ప్రాజెక్ట్ మేనేజర్ వి. అశోక్ కుమార్, కౌన్సిలర్లకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.




