Darsi: దర్శిలో రూ. 120 కోట్లతో అమృత్ 2.0 తాగునీటి పథకం ప్రారంభం!
Darsi: దర్శి పట్టణంలో రూ.120 కోట్లతో అమృత్ 2.0 తాగునీటి పథకాన్ని ప్రారంభించిన టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ. 8 వేల గృహాలకు కుళాయి కనెక్షన్లు.
Darsi: దర్శిలో రూ. 120 కోట్లతో అమృత్ 2.0 తాగునీటి పథకం ప్రారంభం!
Darsi: ఇక దర్శి పట్టణ ప్రజానీకానికి తాగునీటి కష్టాలు లేనట్లేనని రు.120 కోట్ల రూపాయల తో అమృత్ 2.O పథకం పనులను బుధవారం దర్శి టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మీ, మాజీ శాసనసభ్యులు నారపుశెట్టి పాపారావు, టిడిపి యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, స్థానిక నాయకులు అధికారులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ మాట్లాడుతూ దర్శి ప్రజలకు ఇది ఎంతో సంతోషం కలిగిస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ప్రియతమ ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబునాయుడు ఉపముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ , ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ బాబు మున్సిపల్ శాఖ మంత్రివర్యులు నారాయణ సంపూర్ణ సహకారంతో ఇంటింటికి మంచినీరు అందించే పథకాన్ని మనం ప్రారంభించుకున్నాం ఇది ఒక శుభ పరిణామం.
దర్శి పట్టణ అభివృద్ధిలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే ఈ పథకం ప్రారంభం అవడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. దర్శి పట్టణ ప్రజలందరికీ ఇక తాగునీటి కష్టాలు ఉండవని ఆమె ఈ సందర్భంగా గుడ్ న్యూస్ చెప్పారు. దాదాపు 8 వేల కుళాయిలను అందజేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం మౌలిక సదుపాయాలు కల్పించే లక్ష్యంగా అభివృద్ధి ఎజెండాగా అటు గ్రామాలలో ఇటు పట్టణంలో రోడ్లు, డ్రైన్లు, తాగు సాగునీరు అందించేందుకు మన ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అందులో భాగంగానే వందల కోట్ల రూపాయల అభివృద్ధి పనులను దర్శి నియోజకవర్గంలో మన కూటమి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత పూర్తి చేసుకున్నామన్నారు.
అందులో భాగంగానే దర్శి పట్టణ ప్రజల త్రాగు నీటి కష్టాలు లేకుండా శ్వాసత పరిష్కారంలో భాగంగా పులిపాడు చెరువు విస్తరణ పనులు చేపట్టి తద్వారా ఇంటింటికి కొళాయిలు అందించి తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం అమృత పథకం 2.O ద్వారా సాధ్యమవుతుందన్నారు.
దర్శి అభివృద్ధిలో ఇదొక కీలక మలుపు తాగునీరు మౌలిక సదుపాయాల కల్పన ద్వారా పట్టణ రూపురేఖలు మారిపోతాయి అన్నారు. గత ఐదేళ్లు వైసిపి ప్రభుత్వం ఈ పథకాన్ని అటకెక్కించింది అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం మన కూటమి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో దర్శి మండల టిడిపి టౌన్ రూరల్ అధ్యక్షులు కూటమి శ్రేణులు పాల్గొన్నారు.




