Podili: పొదిలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్‌ఓ!
Podili: పొదిలి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ పోలింగ్ కేంద్రాలను ఆర్‌ఓ నిర్మలా దేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు పరిశీలించారు నవంబర్ 5న పోలింగ్‌కు వసతులు కల్పించాలన్నారు
Podili: పొదిలిలో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్‌ఓ!
Podili: స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో నవంబర్ 5న జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్‌కు సంబంధించి పొదిలి మండలంలోని పోలింగ్ కేంద్రాలను అధికారులు పరిశీలించారు. ఆర్‌ఓ నిర్మలా దేవి, ఎంపీడీఓ శ్రీనివాసరావు మండల పరిధిలోని మల్లవరం, సూదనగుంట గ్రామాల్లోని పలు పోలింగ్ కేంద్రాలను పరిశీలించి అక్కడి ఏర్పాట్లను సమీక్షించారు.
పోలింగ్ రోజున ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని పంచాయతీ కార్యదర్శి మారెళ్ల పద్మకు అధికారులు సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి వసతి కల్పించాలని, అవసరాన్ని బట్టి టెంట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా, ప్రశాంతంగా జరిగేలా ముందస్తు ఏర్పాట్లను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.




