Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ రేసులో ఆర్డీ రామకృష్ణ!

Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ రేసులో వైఎస్సార్సీపీ నేత ఆర్డీ రామకృష్ణ. పలు కీలక పదవుల అనుభవం, జనరల్ కేటగిరీ కావడంతో ముమ్మరమైన రాజకీయ ప్రయత్నాలు.

PATTAN YAKUB KHAN, GIDDALURU
Published on: 16 Oct 2026 7:10 AM IST
Giddalur
X

Giddalur: గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ రేసులో ఆర్డీ రామకృష్ణ!

Giddalur: మార్కాపురం జిల్లా గిద్దలూరు మున్సిపల్ ఎన్నికలు రోజురోజుకూ రసవత్తరంగా మారుతున్నాయి. చైర్మన్ పీఠాన్ని దక్కించుకునేందుకు ఆశావహులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్న నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆర్డీ రామకృష్ణ సైతం చైర్మన్ రేసులో ఉన్నట్లు సంకేతాలు ఇస్తున్నారు. గిద్దలూరు పట్టణంలో సుపరిచితుడిగా, ప్రజలతో సత్సంబంధాలు కలిగిన నాయకుడిగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది.

ఆర్డీ రామకృష్ణ గతంలో సొసైటీ కోఆపరేటివ్ బ్యాంక్ డైరెక్టర్‌గా, జడ్పీటీసీగా, మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా, నగర పంచాయతీ వైస్ చైర్మన్‌గా పలు కీలక బాధ్యతలు నిర్వహించారు. గుంటూరు రైల్వే డివిజన్ డీఆర్‌యూసీసీ బోర్డు సభ్యుడిగా కూడా పనిచేశారు. కాంగ్రెస్ పార్టీలో క్రియాశీల పదవులు చేపట్టిన ఆయన అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వెన్నంటే నిలుస్తూ పార్టీ పట్ల తన నిబద్ధతను చాటుకుంటున్న నాయకుడిగా ఆర్డీ రామకృష్ణకు గుర్తింపు ఉంది. గతంలో నగర పంచాయతీ పాలన సమయంలో రాజకీయ సమీకరణాల కారణంగా చైర్మన్ పదవికి సంబంధించిన అవకాశాన్ని వదులుకోవాల్సి వచ్చినప్పటికీ, రాజకీయాల్లో చురుగ్గా కొనసాగుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.

ప్రస్తుతం గిద్దలూరు మున్సిపల్ చైర్మన్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించడంతో ఆశావహుల మధ్య పోటీ ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో ఆర్డీ రామకృష్ణ సైతం చైర్మన్ పీఠంపై ఆశలు పెట్టుకుని తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. పట్టణంలో తనకున్న గుర్తింపు, గతంలో నిర్వహించిన పదవుల అనుభవంతో పార్టీ అధిష్ఠానం దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే, చైర్మన్ అభ్యర్థిగా పార్టీ ఎవరికి అవకాశం కల్పిస్తుందన్నది రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

PATTAN YAKUB KHAN, GIDDALURU

PATTAN YAKUB KHAN, GIDDALURU