Markapur: త్రిపురాంతకం మండలంలో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం!
Markapur: త్రిపురాంతకం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం. ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. దర్యాప్తు చేస్తున్న పోలీసులు.
Markapur: త్రిపురాంతకం మండలంలో ప్రైవేట్ అంబులెన్స్ బీభత్సం!
Markapur: త్రిపురాంతకం మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. గొల్లపల్లివెల్లంపల్లి గ్రామాల మధ్య జరిగిన ఈ ప్రమాదంలో ప్రైవేట్ అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు.
మృతులను త్రిపురాంతకం మండలం సోమేపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పల్లెపోగు ప్రసాద్ (29), నార్నెపాటి కోటేశ్వరరావు (48)గా స్థానికులు గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని ప్రమాదానికి సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు. ప్రమాదానికి గల పూర్తి కారణాలు పోలీసుల దర్యాప్తులో తెలియాల్సి ఉంది.




