Addanki: అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ!
Addanki: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో అద్దంకిలో జిల్లా ఎస్పీ వి. హర్షవర్ధన్ రాజు తనిఖీలు. పోలింగ్ కేంద్రాలు, చెక్పోస్టుల పరిశీలన, శాంతిభద్రతలపై పోలీసులకు ఆదేశాలు.
Addanki: అద్దంకిలో మున్సిపల్ ఎన్నికల భద్రతా ఏర్పాట్లను పరిశీలించిన ఎస్పీ!
Addanki: మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అద్దంకి పట్టణంలోని కట్ట కింద పాలెం ఎన్టీఆర్ కాలనీ పోలింగ్ కేంద్రాలు, తిమ్మాయిపాలెం చెక్పోస్టులను పరిశీలించిన జిల్లా ఎస్పీ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.
ఈ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో, ఓటర్లు , ప్రజలు సహకరించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా నిర్వహించేందుకు పోలీసు అధికారులు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ముందస్తుగా రౌడీ షీటర్ల పై బైండోవర్ కేసులు పెట్టడం జరుగుతుందని అన్నారు. సోషల్ మీడియా మాధ్యమాలలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పెట్టే పోస్టులపై కేసులు నమోదవుతాయని హెచ్చరించారు
ప్రతి పోలీస్ చెక్ పాయింట్ వద్ద ముమ్మరంగా అన్ని వాహనాలు తనిఖీలు నిర్వహించడం జరుగుతుందన్నారు., ఎన్నికలు నేపథ్యంలో వాహనాలలో మద్యం బాటిల్స్ పంపిణీ చేసినను ,మనీ ట్రాన్స్ఫర్ లపై నిఘా చేపట్టి వారి పై కేసులు కట్టడం జరుగుతుందన్నారు.




