Markapuram: ఎస్‌వీకేపీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఎస్‌వీకేపీ కళాశాలలో ప్రారంభం. పోస్టల్ బ్యాలెట్లలో టీడీపీ ముందంజ, అధికారుల పరిశీలన.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 3 Nov 2026 11:52 AM IST
Markapuram
X

Markapuram: ఎస్‌వీకేపీ కళాశాలలో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభం!

Markapuram: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ స్థానిక ఎస్‌వీకేపీ కళాశాలలో ప్రారంభమైంది. ముందుగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించగా టీడీపీకి 62 ఓట్లు, వైసీపీకి 23 ఓట్లు వచ్చాయి.

కౌంటింగ్ ప్రక్రియ కోసం అధికారులు 25 టేబుళ్లను ఏర్పాటు చేయగా, మొత్తం 100 మంది ఎన్నికల సిబ్బంది లెక్కింపు విధుల్లో పాల్గొంటున్నారు. జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎస్పీ పంకజ్ కుమార్ మీనా, జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించి ఏర్పాట్లను సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ పులి శ్రీనివాసులు కౌంటింగ్ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు.

మున్సిపల్ కమిషనర్, ఎన్నికల అధికారి డి.వి.ఎస్. నారాయణరావు ఆధ్వర్యంలో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM