Chimakurthy: ఆర్.ఎల్.పురం గ్రానైట్ క్వారీలో హైవాల్ కూలిపోవడంతో ప్రమాదం
Chimakurthy: చీమకుర్తి మండలం ఆర్.ఎల్.పురం గ్రానైట్ క్వారీలో హైవాల్ కూలింది. భారీగా శిథిలాలు పేరుకుపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.
Chimakurthy: ఆర్.ఎల్.పురం గ్రానైట్ క్వారీలో హైవాల్ కూలిపోవడంతో ప్రమాదం
చీమకుర్తి: చీమకుర్తి మండలం ఆర్.ఎల్.పురం గ్రామ పరిధిలోని మిడ్‌వెస్ట్ గ్రానైట్ క్వారీలో ప్రమాదం చోటుచేసుకుంది. క్వారీలో వాహనాల రాకపోకలకు ఉపయోగించే ర్యాంప్ వద్ద ఉన్న హైవాల్ ఒక్కసారిగా జారిపడి కూలడంతో భారీగా శిథిలాలు పేరుకుపోయాయి. ఈ ఘటనతో క్వారీలో పనిచేస్తున్న సిబ్బందిలో ఆందోళన నెలకొంది.
హైవాల్ కూలిపోవడంతో పెద్ద ఎత్తున రాళ్లు, మట్టి శిథిలాలు క్వారీలోకి జారిపడినట్లు తెలుస్తోంది. శిథిలాల కింద భారీ సంఖ్యలో గ్రానైట్ క్వారీకి సంబంధించిన మిషనరీలు ఉన్నట్లు సమాచారం. ప్రమాద సమయంలో ఆయా ప్రాంతాల్లో కార్మికులు ఉన్నారా? లేదా? అనే అంశంపై ప్రస్తుతం స్పష్టత రావాల్సి ఉంది. దీంతో శిథిలాల కింద ఎవరైనా చిక్కుకున్నారా? అనే కోణంలో అధికారులు ఆరా తీస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. శిథిలాల తొలగింపు, సహాయక చర్యలను చేపట్టారు. క్వారీ మిషనరీలకు మాత్




