Bestavaripeta: బేస్తవారిపేట మండలంలో ఆర్మీ జవాన్ కిషన్ అంత్యక్రియలు!
Bestavaripeta: మార్కాపురం బేస్తవారిపేట మండలానికి చెందిన ఆర్మీ హవల్దార్ కిషన్ భౌతికకాయానికి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు కలెక్టర్ ఎస్పీ నివాళులు.
Bestavaripeta: బేస్తవారిపేట మండలంలో ఆర్మీ జవాన్ కిషన్ అంత్యక్రియలు!
Bestavaripeta: బేస్తవారిపేట మండలం పందిళ్ళపల్లి గ్రామానికి చెందిన కువ్వారపు కిషన్ ఆర్మీలో హవల్దార్ గా విధులు నిర్వహిస్తూ అస్సాం రాష్ట్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ నెల 27 వ తేదిన మరణించారు. ఈ నేపథ్యంలో స్వగ్రామం లో కిషన్ పార్దివ దేహానికి బుధవారం ప్రభుత్వ లాంఛనాల ప్రకారం అంతక్రియలు నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత జిల్లా ఎస్పీ ఫంకజ్ కుమార్ మీనా, ఆర్డీవో వెంకట శివరామిరెడ్డి, ఆర్మీ, పోలీస్ అధికారులు అంతక్రియల్లో పాల్గొని ఘనంగా నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా న్యాయం చేస్తామని వారికి భరోసా నిచ్చారు.




