Peddaraveedu: స్థానిక ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించండి!
Peddaraveedu: స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా పెద్దారవీడు మండల ఆర్వో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ ప్రారంభం.
Peddaraveedu: స్థానిక ఎన్నికల విధులు బాధ్యతాయుతంగా నిర్వర్తించండి!
Peddaraveedu: స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో పెద్దారవీడు మండల ఆర్వో కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పోస్టల్ బ్యాలెట్ విధులకు నియమితులైన సిబ్బందికి ప్రత్యేక సమీక్ష నిర్వహించి, ఎన్నికల విధులపై అవసరమైన సూచనలు అందించారు.
ఎమ్మార్వో రామకృష్ణతో కలిసి ఆర్వో రమేష్ కుమార్ పోస్టల్ బ్యాలెట్ ఏర్పాట్లను పరిశీలించారు. పోస్టల్ బ్యాలెట్ విధులకు నియమితులైన సిబ్బంది వివరాలు, చిరునామాలు, డ్యూటీ ఆర్డర్లు, ఐడీ కార్డులకు సంబంధించిన అంశాలను సమీక్షించారు.
సంబంధిత సిబ్బంది తమకు జారీ చేసిన డ్యూటీ ఆర్డర్లు, ఐడీ కార్డులను ముందుగానే పరిశీలించుకోవాలని, పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియకు సంబంధించి నిర్దేశించిన సూచనలు పాటించాలని ఆర్వో రమేష్ కుమార్ తెలిపారు. ఎన్నికల విధుల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండి, బాధ్యతాయుతంగా విధులు నిర్వర్తించాలని ఆర్వో రమేష్ కుమార్, ఎమ్మార్వో రామకృష్ణ సూచించారు.




