Podili: నూతనంగా ప్రారంభమైన షణ్ముఖ గోల్డ్ రికవరీ అండ్ బయ్యర్స్ షాపు

Podili: పొదిలిలో ఘనంగా షణ్ముఖ గోల్డ్ రికవరీ అండ్ బయ్యర్స్ షాపు ప్రారంభం. ప్రారంభించిన టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి వరికుంట అనిల్.

MADARVALI, MARKAPURAM
Published on: 25 Sept 2026 5:08 PM IST
Podili
X

Podili: నూతనంగా ప్రారంభమైన షణ్ముఖ గోల్డ్ రికవరీ అండ్ బయ్యర్స్ షాపు

పొదిలి: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని రాజు హాస్పిటల్ వీధిలో నూతనంగా ఏర్పాటు చేసిన షణ్ముఖ గోల్డ్ రికవరీ అండ్ బయ్యర్స్ షాపును టీడీపీ క్లస్టర్ ఇన్‌చార్జి వరికుంట అనిల్ ప్రారంభించారు.

ఈ సందర్భంగా షాప్ నిర్వాహకులు రావి భార్గవి, దయానందరెడ్డి వరికుంట అనిల్‌కు ఘన స్వాగతం పలికారు. అనంతరం షాపులోని సేవలను పరిశీలించారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ.. ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా షాపును ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో బంగారం అసలైనదా, నకిలీదా గుర్తించడంతో పాటు బంగారం స్వచ్ఛతను సులభంగా, తక్కువ సమయంలో నిర్ధారించనున్నట్లు చెప్పారు.

అలాగే వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో తనఖా పెట్టిన బంగారాన్ని కొనుగోలు చేసి, సంబంధిత లబ్ధిదారులకు బంగారాన్ని విడిపించడంతో పాటు ఆరోజు మార్కెట్ ధరకు అనుగుణంగా మిగిలిన నగదును అందించే సేవలు కూడా అందిస్తున్నట్లు వివరించారు.

ప్రాంతంలో నూతనంగా ప్రారంభమైన షణ్ముఖ గోల్డ్ రికవరీ అండ్ బయ్యర్స్ సంస్థను ప్రజలు ఆదరించి, సేవలను వినియోగించుకోవాలని నిర్వాహకులు కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణానికి చెందిన పలువురు వ్యాపారులు, ప్రజలు పాల్గొన్నారు

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM