Podili: ప్లాస్టిక్ నివారణపై సెయింట్ ఆన్స్ హైస్కూల్ అవగాహన
Podili: పొదిలి సెయింట్ ఆన్స్ హైస్కూల్‌లో పర్యావరణ పరిరక్షణ అవగాహన కార్యక్రమం. ప్లాస్టిక్‌కు నో చెప్పాలని విద్యార్థులకు పిలుపు.
Podili: ప్లాస్టిక్ నివారణపై సెయింట్ ఆన్స్ హైస్కూల్ అవగాహన
పొదిలి: ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించి.. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలనే సందేశంతో మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని సెయింట్ ఆన్స్ హై స్కూల్ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది.“Say No to Plastic – Choose a Cleaner, Greener Tomorrow” అనే నినాదంతో విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు.
విద్యార్థుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం...ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాల్సిన ఆవశ్యకతను విద్యార్థులకు వివరిస్తూ సెయింట్ ఆన్స్ హై స్కూల్ ఆధ్వర్యంలో ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాస్టిక్ బ్యాగులకు బదులుగా క్లాత్ బ్యాగులను ఉపయోగించాలని... సింగిల్ యూజ్ ప్లాస్టిక్ బాటిళ్లకు బదులుగా పునర్వినియోగ బాటిళ్లను వినియోగించాలని విద్యార్థులకు సూచించారు.
పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు... చెత్తను ఎక్కడపడితే అక్కడ వేయకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని అవగాహన కల్పించారు.“Reduce – Reuse – Recycle” అనే సూత్రాన్ని ప్రతి ఒక్కరూ పాటించాలని పాఠశాల ప్రిన్సిపాల్ నారాయణ సూచించారు.చిన్న వయసు నుంచే విద్యార్థుల్లో పర్యావరణంపై బాధ్యతాయుతమైన ఆలోచనలను పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు.
పరిశుభ్రమైన క్యాంపస్‌తో పాటు... పచ్చని భవిష్యత్తును నిర్మించడమే తమ లక్ష్యమని తెలిపారు.“చిన్న మార్పులు... పెద్ద మార్పుకు నాంది” అనే సందేశంతో ప్రతి విద్యార్థి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామి కావాలని సెయింట్ ఆన్స్ హై స్కూల్ పిలుపునిచ్చింది.ప్లాస్టిక్‌కు నో చెప్పి... పర్యావరణ పరిరక్షణకు చేయూతనిద్దాం...పరిశుభ్రమైన పరిసరాలు... పచ్చని భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరిద్దాం అంటూ విద్యార్థులకు అవగాహన కల్పించారు.




