Podili: పొదిలిలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం!
Podili: మార్కాపురం జిల్లా పొదిలిలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌రావు సమావేశం.. పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి సహకరించాలని సూచన.
Podili: పొదిలిలో వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ సమావేశం!
Podili: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణంలోని స్థానిక మండల పరిషత్ కార్యాలయం సమీపంలో మున్సిపల్ స్థలాల్లో షెడ్లు ఏర్పాటు చేసుకుని తాత్కాలికంగా వ్యాపారాలు నిర్వహిస్తున్న వీధి వ్యాపారులతో మున్సిపల్ కమిషనర్ రామ్మోహన్‌రావు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి, మున్సిపాలిటీ ఆదాయ వనరుల పెంపులో భాగంగా మున్సిపల్ స్థలాల్లో వ్యాపారాలు నిర్వహిస్తున్న వారికి నిర్దిష్ట కొలతలు నిర్ణయించి, నిబంధనల ప్రకారం మున్సిపాలిటీకి పన్నులు చెల్లించాలని కమిషనర్ సూచించారు. మున్సిపాలిటీకి ఆదాయం సమకూరితే పట్టణంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం ఉంటుందని తెలిపారు.
పట్టణ అభివృద్ధికి వ్యాపారులు కూడా సహకరించాలని కోరారు. ప్రస్తుతం ఆయా మున్సిపల్ స్థలాల్లో ఎవరు వ్యాపారాలు నిర్వహిస్తున్నారో వారి పేర్లను నమోదు చేసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు.
వ్యాపారులు కూడా మున్సిపల్ నిబంధనలను పాటిస్తూ పట్టణ పరిశుభ్రత, అభివృద్ధికి సహకరించాలని కమిషనర్ కోరారు. ఈ సమావేశంలో శానిటరీ ఇన్‌స్పెక్టర్ మారుతీరావుతో పాటు పట్టణంలోని వీధి వ్యాపారులు పాల్గొన్నారు.




