Podili: పొదిలిలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం: ఉత్తమ గురువులకు సత్కారం
Podili: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో జిల్లా, మండల ఉత్తమ ఉపాధ్యాయులను ఘనంగా సత్కరించారు.
Podili: పొదిలిలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం: ఉత్తమ గురువులకు సత్కారం
పొదిలి: అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మార్కాపురం జిల్లా పొదిలిలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులను ఒకే వేదికపై ఘనంగా సత్కరించారు.
ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి, మెమెంటోలు అందజేసి సన్మానించారు. విద్యార్థులకు విద్యాబోధనతో పాటు సమాజ సేవలోనూ ఉపాధ్యాయులు కీలక పాత్ర పోషిస్తున్నారని నిర్వాహకులు పేర్కొన్నారు.
మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గత మూడేళ్లుగా ఉపాధ్యాయులను గౌరవిస్తూ సన్మాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది పొదిలి ప్రాంతం నుంచి అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు జిల్లా, మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో పొదిలి మండల విద్యాశాఖ అధికారి, మానవత ఎడ్యుకేషనల్ డైరెక్టర్ బీవీ రెడ్డి, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లా అధ్యక్షుడు మువ్వల పార్థసారథి, రిటైర్డ్ మండల డిప్యూటీ విద్యాశాఖ అధికారి మామిళ్లపల్లి శ్రీనివాసరెడ్డి, మాజీ జిల్లా అధ్యక్షుడు కాకునూరి ఎలమందరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి కపురం శ్రీనివాసరెడ్డి, పిల్లి రమణారెడ్డి, పి. బాల వెంకటేశ్వర్లు, బి. యోగిరెడ్డి, కోటేశ్వరరావు, కార్యదర్శి చిట్టెంశెట్టి వెంకట కృష్ణారావు, కోశాధికారి బండి అశోక్, ఉపాధ్యక్షుడు భూమా సుమంత్, వినోద్ రాజ్, ఎద్దు నగేష్, రాజ్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు కిరణ్మయి, భవాని, శ్రీను తదితరులు పాల్గొన్నారు. అవార్డులు అందుకున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు కార్యక్రమంలో పాల్గొన్నారు.




