Podili: పొదిలి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జనసేన నాయకుడు మద్దుల శ్రీను!
Podili: పొదిలి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జనసేన నాయకుడు మద్దుల శ్రీను ఖరారు. పొదిలి అభివృద్ధి, తాగునీటి సమస్య పరిష్కారమే ధ్యేయమని స్పష్టం.
Podili: పొదిలి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జనసేన నాయకుడు మద్దుల శ్రీను!
Podili: పొదిలి జెడ్పీటీసీ కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున మద్దుల శ్రీను పేరును ఖరారు చేశారు. కూటమి పొత్తులో భాగంగా పొదిలి జెడ్పీటీసీ స్థానాన్ని జనసేన పార్టీకి కేటాయించడంతో పార్టీ అధిష్ఠానం మద్దుల శ్రీను అభ్యర్థిత్వానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్న మద్దుల శ్రీను మాట్లాడుతూ పొదిలి అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. పట్టణంతో పాటు పరిధిలోని ప్రాంతాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. ముఖ్యంగా త్రాగునీటి సమస్య పరిష్కారం, పరిశుభ్రత, పారిశుధ్య సదుపాయాల మెరుగుదలకు అధిక ప్రాధాన్యం ఇస్తానని పేర్కొన్నారు.
ప్రజల అవసరాలను తెలుసుకుని, వారి సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని మద్దుల శ్రీను తెలిపారు. పొదిలి ప్రాంతాన్ని మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు అందరి సహకారం అవసరమని కోరారు.
కూటమి బలంతో విజయం ఖాయం
కూటమి పొత్తులో భాగంగా టీడీపీ, జనసేన, బీజేపీ సమన్వయంతో ఎన్నికల ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్లనున్నట్లు కూటమి నాయకులు తెలిపారు. టీడీపీ, బీజేపీ నాయకులు, కార్యకర్తలు జనసేన అభ్యర్థి మద్దుల శ్రీను విజయానికి పూర్తి స్థాయిలో సహకరించాలని కూటమి నాయకత్వం పిలుపునిచ్చింది.
మూడు పార్టీల నాయకులు, కార్యకర్తల సమిష్టి కృషి, ప్రజల ఆదరణతో పొదిలి జెడ్పీటీసీ స్థానాన్ని భారీ మెజారిటీతో కైవసం చేసుకుంటామని కూటమి శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. అభివృద్ధి, మౌలిక వసతులు, ప్రజా సమస్యల పరిష్కారమే ప్రధాన అజెండాగా ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ హల్చల్ జహీర్ , సయ్యద్ సాదిక్, విజయలక్ష్మి బిజెపి, సందీప్ పాల్గొన్నారు.




