Podili: రెన్యువల్ కాని మద్యం షాపులకు నోటిఫికేషన్: పొదిలి ఎక్సైజ్
Podili: పొదిలి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో రెన్యువల్ కాని 4 మద్యం షాపులకు కొత్త నోటిఫికేషన్ జారీ చేసినట్లు ఎక్సైజ్ సీఐ అరుణకుమారి వెల్లడించారు.
Podili: రెన్యువల్ కాని మద్యం షాపులకు నోటిఫికేషన్: పొదిలి ఎక్సైజ్
పొదిలి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న మద్యం షాపుల లైసెన్సుల గడువు ముగియడంతో రెన్యువల్ చేసుకోవాల్సిందిగా ఎక్సైజ్ శాఖ ఇప్పటికే ప్రకటన జారీ చేసినట్లు పొదిలి ఎక్సైజ్ సీఐ అరుణకుమారి తెలిపారు. అయితే గడువులోగా కొన్ని మద్యం షాపులు రెన్యువల్ చేసుకోకపోవడంతో వాటి స్థానంలో కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసి లైసెన్సుల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆమె వెల్లడించారు.
2026–27 సంవత్సరానికి సంబంధించి ఓపెన్ కేటగిరీలో పొదిలి ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని పొదిలి రూరల్, హనుమంతునిపాడు, కొనకనమిట్ల, తర్లపాడు మండలాల్లో రెన్యువల్ కాని నాలుగు మద్యం షాపులకు కొత్తగా నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు.
పొదిలి రూరల్ షాపుకు సంబంధించి ఒక సంవత్సరానికి నాన్-రిఫండబుల్ అప్లికేషన్ ఫీజు రూ.3 లక్షలుగా, స్లాబ్ సిస్టమ్‌లో రూ.71.50 లక్షలుగా, పర్మిట్ రూమ్‌కు రూ.7.50 లక్షలుగా నిర్ణయించినట్లు సీఐ వివరించారు.
ఆసక్తి ఉన్నవారు అక్టోబర్ 1వ తేదీ అర్ధరాత్రి 12 గంటల వరకు నిర్దేశిత వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. దరఖాస్తుదారుల ఎంపిక కోసం అక్టోబర్ 5న మార్కాపురంలోని పీజీఆర్‌ఎస్ హాల్‌లో డ్రా నిర్వహించి విజేతలను ఎంపిక చేయనున్నట్లు చెప్పారు.
ప్రస్తుతం బ్యాంకులు వరుసగా మూడు రోజులపాటు సమ్మెలో పాల్గొంటున్నందున దరఖాస్తుదారులు ముందుగానే అవసరమైన మొత్తాన్ని బ్యాంకు ఖాతాల్లో జమ చేసుకోవాలని సీఐ అరుణకుమారి సూచించారు. రేపు ఆదివారం కూడా బ్యాంకులు పనిచేస్తున్నందున ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.




