Kandukur: కందుకూరులో మోదీ బర్త్‌డే: దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే ఇంటూరి
Kandukur: ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా కందుకూరులో ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొవ్వొత్తులు, దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు.
Kandukur: కందుకూరులో మోదీ బర్త్‌డే: దీపాలు వెలిగించిన ఎమ్మెల్యే ఇంటూరి
ప్రకాశం జిల్లా: కందుకూరు నియోజకవర్గం, గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర దాస్ మోడీ పుట్టినరోజు సందర్భంగా... సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని కందుకూరులో గురువారం సాయంత్రం ఘనంగా జరిపారు.
కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో, ప్రధానమంత్రి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ... కొవ్వొత్తులు వెలిగించి, దీప ప్రజ్వలన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ... మోడీ సారథ్యంలో దేశం అన్ని రంగాలలో దూసుకుపోతోందని అన్నారు. ప్రపంచంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాలలో భారత్ అగ్రస్థానంలో ఉండడానికి మోదీయే కారణం అన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వానికి ఆయన గొప్ప సహకారం అందిస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా నేతలందరూ ప్రధానమంత్రి కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ వద్ద జరిగిన కార్యక్రమంలో పట్టణ టిడిపి అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, రూరల్ అధ్యక్షుడు బుస్సారెడ్డి కృష్ణారెడ్డి, ఒంగోలు డైరీ మాజీ చైర్మన్ చల్లా శ్రీనివాసరావు, రూరల్ మాజీ అధ్యక్షుడు నార్నే రోశయ్య, నియోజకవర్గ అధ్యక్షులు అల్లం వెంకటేశ్వర్లు, పొడపాటి మహేష్, పార్టీ నేతలు రాయపాటి శ్రీనివాసరావు, గోచిపాతల మోషే, నాదెళ్ల రమణయ్య, తన్నీరు ఏడుకొండలు, గొంది నరసింగరావు, పలువురు సీనియర్ నాయకులు పాల్గొన్నారు.




