Peddaraveedu: పెద్దారవీడులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి ప్రచారం!
Peddaraveedu: పెద్దారవీడు ఎంపీటీసీ టీడీపీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి ఇంటింటి ప్రచారం. సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి.
Peddaraveedu: పెద్దారవీడులో టీడీపీ ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి ప్రచారం!
Peddaraveedu: స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పెద్దారవీడు టీడీపీ బలపరిచిన ఎంపీటీసీ అభ్యర్థి గొట్టం వెంకటలక్ష్మి దూకుడు పెంచారు. గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ఓటర్లను కలుసుకుని విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, గ్రామాల్లో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పరిశీలించి ఓటు వేయాలని ప్రజలను కోరారు. గూడూరి ఎరిక్షన్ బాబు నాయకత్వంలో పెద్దారవీడు గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
తనను గ్రామ ఆడబిడ్డగా భావించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. అభివృద్ధి, సంక్షేమమే లక్ష్యంగా సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు.
ఈ ప్రచార కార్యక్రమంలో గొట్టం రామనారాయణరెడ్డి, గొట్టం రఘునాథరెడ్డి, వల్లూరి సుబ్బారెడ్డి, గొట్టం సత్యంరెడ్డి, అల్లు వెంకటేశ్వరరెడ్డి, గొట్టం శంకర్, జానపాటి కోటేశ్వరరావు, వాయిది ఏగేశ్వరరావుతో పాటు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




