Peddaraveedu: పెద్దారవీడు సచివాలయంలో సిబ్బంది కరవు ఇబ్బందుల్లో ప్రజలు!

Peddaraveedu: పెద్దారవీడు సచివాలయంలో నెల రోజులుగా పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఎంపీడీవో తీరుపై గ్రామస్తులు ఆగ్రహం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 13 Oct 2026 4:14 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు సచివాలయంలో సిబ్బంది కరవు ఇబ్బందుల్లో ప్రజలు!

పెద్దారవీడు: పెద్దారవీడు మండల కేంద్రంలోని గ్రామ సచివాలయంలో గత నెల రోజులుగా పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్ లేకపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వ సేవలు, ధ్రువపత్రాలు, పంచాయతీకి సంబంధించిన పనుల కోసం సచివాలయానికి వస్తున్న గ్రామస్తులు సిబ్బంది లేకపోవడంతో నిరాశతో వెనుదిరుగుతున్నారు.

సర్పంచుల పదవీకాలం ముగిసిన నేపథ్యంలో పంచాయతీ పరిపాలనలో సెక్రటరీ పాత్ర కీలకంగా మారింది. అలాంటి సమయంలో మండల కేంద్రంలోని సచివాలయంలోనే కీలక సిబ్బంది లేకపోవడంపై గ్రామస్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నెల రోజులుగా సమస్య కొనసాగుతున్నా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడంపై ఎంపీడీవో జాన్ సుందరం తీరును ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ ఎం. విజయ సునీత స్పందించి, వెంటనే పంచాయతీ సెక్రటరీ, డిజిటల్ అసిస్టెంట్‌ను నియమించి ప్రజల ఇబ్బందులు తొలగించాలని గ్రామస్తులు కోరుతున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM