Peddaraveedu: పెద్దారవీడు మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా మెట్టు లక్ష్మీదేవి శ్రీనివాసరెడ్డి!

Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా దేవరాజుగట్టు మాజీ సర్పంచ్ మెట్టు లక్ష్మీదేవి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైనట్లు సమాచారం.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 20 Oct 2026 8:25 AM IST
Peddaraveedu
X

Peddaraveedu: పెద్దారవీడు మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా మెట్టు లక్ష్మీదేవి శ్రీనివాసరెడ్డి!

Peddaraveedu: పెద్దారవీడు మండల టీడీపీ ఎంపీపీ అభ్యర్థిగా దేవరాజుగట్టు మాజీ సర్పంచ్ మెట్టు లక్ష్మీదేవి శ్రీనివాసరెడ్డి పేరు ఖరారైనట్లు సమాచారం. టీడీపీ మండల కన్వీనర్ మెట్టు శ్రీనివాసరెడ్డి సతీమణి అయిన ఆమెకు పార్టీ అవకాశం కల్పించడంతో మండల రాజకీయాల్లో ఆసక్తి నెలకొంది.

గతంలో దేవరాజుగట్టు సర్పంచ్‌గా పనిచేసిన మెట్టు లక్ష్మీదేవి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు సహకారంతో గ్రామ సచివాలయ నిర్మాణం, పాఠశాల విద్యార్థుల కోసం వాటర్ ప్లాంట్ ఏర్పాటు వంటి పనులకు చొరవ చూపారు. ఉత్తమ సర్పంచ్‌గా అవార్డు కూడా అందుకున్నారు.

మరోవైపు, టీడీపీ మండల కన్వీనర్‌గా మెట్టు శ్రీనివాసరెడ్డి పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేస్తూ మండలంలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. సర్పంచ్‌గా మెట్టు లక్ష్మీదేవికి ఉన్న అనుభవం, ప్రజలతో ఉన్న అనుబంధం ఎంపీపీ అభ్యర్థిగా ఆమెకు ప్రాధాన్యత తీసుకొచ్చిన అంశాలుగా చర్చ జరుగుతోంది. గ్రామస్థాయి అభివృద్ధి అనుభవంతో ఇప్పుడు మండల స్థాయిలో ఎలాంటి పాత్ర పోషిస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM