Peddaraveedu: దేవరాజుగట్టులో రేపు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం!

Peddaraveedu: ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం దేవరాజుగట్టులో సోమవారం ఉదయం 9 గంటలకు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం జరగనుండగా, ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు హాజరుకానున్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 15 Nov 2026 4:28 PM IST
Peddaraveedu
X

Peddaraveedu: దేవరాజుగట్టులో రేపు టీడీపీ విస్తృతస్థాయి సమావేశం!

పెద్దారవీడు: పెద్దారవీడు మండలంలోని దేవరాజుగట్టు గ్రామంలో 16వ తేదీ సోమవారం ఉదయం 9 గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయం టిడిపి మండల అధ్యక్షులు మెట్టు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నారు. గ్రామపంచాయతీలు, స్థానిక సంస్థల బలోపేతం, పార్టీ భవిష్యత్ కార్యాచరణపై నాయకులు, కార్యకర్తలతో సమావేశంలో చర్చించనున్నారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా యర్రగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఇన్‌ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు హాజరుకానున్నారు. మండలంలోని టీడీపీ, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని మండల టీడీపీ అధ్యక్షుడు మెట్టు శ్రీనివాస రెడ్డి పిలుపునిచ్చారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM