Markapur: పెద్ద ఇర్లపాడులో ఎస్ఎంసీ ఎన్నికల వాయిదా.. తల్లిదండ్రుల ఆగ్రహం
Markapur: పెద్ద ఇర్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలలో ఎస్ఎంసీ ఎన్నికలు వాయిదా పడటంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రధానోపాధ్యాయుడిని నిలదీశారు.
Markapur: పెద్ద ఇర్లపాడులో ఎస్ఎంసీ ఎన్నికల వాయిదా.. తల్లిదండ్రుల ఆగ్రహం
మార్కాపురం జిల్లా: కనిగిరి పెద్ద చెర్లోపల్లి మండలం: మండలంలోని పెద్ద ఇర్లపాడు ZPHS పాఠశాలలో గురువారం నిర్వహించాల్సిన స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (SMC) ఎన్నికల ప్రక్రియ వాయిదా పడటంపై విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలుగుదేశం పార్టీకి మెజారిటీ రాదనే కారణంతో రాజకీయ అండదండలతో ఎన్నికలను అనైతికంగా వాయిదా వేశారంటూ పలువురు తల్లిదండ్రులు ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియలో పారదర్శకత పాటించాలని, నిబంధనల ప్రకారం SMC ఎన్నికలు నిర్వహించాలని వారు డిమాండ్ చేశారు.
ఎన్నికల వాయిదాపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడిని తల్లిదండ్రులు ప్రశ్నిస్తూ నిరసన వ్యక్తం చేసినట్లు సమాచారం. SMC ఎన్నికలు రాజకీయ జోక్యాలకు అతీతంగా, ప్రభుత్వ నిబంధనల ప్రకారం పారదర్శకంగా నిర్వహించాలని వారు కోరారు.
ఈ వ్యవహారంపై సంబంధిత విద్యాశాఖ అధికారులు స్పందించి, ఎన్నికల వాయిదాకు గల కారణాలను స్పష్టం చేయాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు.




