Markapuram: పెద్ద దోర్నాలలో ప్రశాంతంగా ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో 13 ఎంపీటీసీ, 1 జెడ్పీటీసీ స్థానాలకు 46 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ప్రారంభమైంది.
Markapuram: పెద్ద దోర్నాలలో ప్రశాంతంగా ప్రారంభమైన పరిషత్ ఎన్నికల పోలింగ్!
Markapuram: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. మండలవ్యాప్తంగా మొత్తం 13 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం మండలంలో 46 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఉదయం నుంచే ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకుని బారులు తీరారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.




