Pedda Dornala: పెద్ద దోర్నాలలో మధ్యాహ్నం 2 గంటలకు 47.81% పోలింగ్
Pedda Dornala: మార్కాపురం జిల్లా పెద్ద దోర్నాల మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో మధ్యాహ్నం 2 గంటల వరకు 47.81 శాతం పోలింగ్ నమోదైంది.
Pedda Dornala: పెద్ద దోర్నాలలో మధ్యాహ్నం 2 గంటలకు 47.81% పోలింగ్
మార్కాపురం జిల్లా: పెద్ద దోర్నాల మండల పరిధిలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. మండలంలోని 13 ఎంపీటీసీ స్థానాలతో పాటు జడ్పీటీసీ స్థానానికి ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొత్తం 46 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు.
ఉదయం నుంచి పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల సమయానికి మండల వ్యాప్తంగా 47.81 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. పోలింగ్ ముగిసే సమయానికి మరింత మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునే అవకాశం ఉంది.




