Pedda Dornala: పెద్ద దోర్నాల: నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక

Pedda Dornala: పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎస్‌ఎంసీ చైర్మన్‌గా షేక్ మక్బూల్ భాష, వైస్ చైర్మన్‌గా కల్లె శైలజ ఎన్నికయ్యారు. హెచ్ఎం అధ్యక్షతన ఎన్నికలు ముగిశాయి.

Srikanth Singam, Markapur
Published on: 29 Sept 2026 6:17 PM IST
Pedda Dornala
X

Pedda Dornala: పెద్ద దోర్నాల: నూతన పాఠశాల యాజమాన్య కమిటీ ఎన్నిక

పెద్ద దోర్నాల: పెద్ద దోర్నాల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పాఠశాల యాజమాన్య కమిటీ (SMC) మరియు తల్లిదండ్రుల మానిటరింగ్ కమిటీ సభ్యుల ఎన్నికలు ఈరోజు నిర్వహించబడ్డాయి.

పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పి. శ్యామప్రసన్నతాంజలి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో తల్లిదండ్రుల నుంచి హాజరైన సభ్యులలో 19 మందిని పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులుగా ఎంపిక చేశారు. అనంతరం నూతన కమిటీ సభ్యుల నుంచి చైర్మన్, వైస్ చైర్మన్‌లను ఎన్నుకున్నారు.

నూతన పాఠశాల యాజమాన్య కమిటీ

చైర్మన్: షేక్ మక్బూల్ భాష

వైస్ చైర్మన్: కల్లె శైలజ

కమిటీ సభ్యులు:

1. షేక్ అబ్దుల్ రెహమాన్

2. కే. మల్లికార్జున నాయక్

3. పి. కిరణ్ కుమార్

4. వి. జ్యోతి

5. ఎం. మరియా కుమారి

6. కే. శ్రీను

7. జి. లక్ష్మీదేవి

8. పి. ముర్తు జాబి

9. బి. మహబూని

10. డి. లాలీబి

11. షేక్ మస్తాన్వలి

12. షేక్ మౌలాలి

13. ఏ. సౌందర్య

14. సయ్యద్ మౌలాలి

15. డి. సుమలత

16. బి. దానయ్య

17. పి. రమేష్

అదనపు సభ్యులు

1. ఎంపీ నరసింహులు

2. కే. నాగలక్ష్మి

3. కె.పి. బాలనాగమ్మ

4. జి. విజయ మాణిక్యం

5. టి. వెంకట శివ

అదనపు సభ్యులను ఎక్స్ అఫీషియో సభ్యులుగా నియమించడం జరిగింది.

ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయురాలు మాట్లాడుతూ, పాఠశాల అభివృద్ధి, విద్యార్థుల విద్యా ప్రమాణాల పెంపు, మౌలిక సదుపాయాల మెరుగుదల, విద్యార్థుల హాజరు శాతం పెంపు వంటి అంశాల్లో పాఠశాల యాజమాన్య కమిటీ సభ్యులు చురుకైన పాత్ర పోషించాలని కోరారు. పాఠశాల అభివృద్ధికి ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు సమన్వయంతో కృషి చేయాలని ఆమె ఆకాంక్షించారు.

నూతనంగా ఎన్నికైన చైర్మన్, వైస్ చైర్మన్ మరియు కమిటీ సభ్యులకు పాఠశాల ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందనలు తెలియజేశారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur