Markapur: పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు పంచాలి: ఎస్టీయూ నేత ఎర్రయ్య

Markapur: మార్కాపురం పూల సుబ్బయ్య శాంతివనంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో గాంధీ, శాస్త్రి జయంతులు నిర్వహించారు. పిల్లలకు ఆస్తులకన్నా విలువలనే పంచాలని ఎర్రయ్య సూచించారు.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 2 Oct 2026 5:34 PM IST
Markapur
X

Markapur: పిల్లలకు ఆస్తులు కాదు.. విలువలు పంచాలి: ఎస్టీయూ నేత ఎర్రయ్య

మార్కాపురం జిల్లా: తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తుల కంటే సత్యం, నిజాయితీ, క్రమశిక్షణ, మానవతా విలువలను వారసత్వంగా అందించాలని ఎస్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కే. ఎర్రయ్య సూచించారు.

గాంధీజీ, లాల్ బహదూర్ శాస్త్రి జయంతి సందర్భంగా మార్కాపురంలోని పూల సుబ్బయ్య శాంతివనంలో ఎస్టీయూ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించి, జాతీయ నాయకుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఎర్రయ్య మాట్లాడుతూ.. విద్యార్థులు జాతీయ నాయకుల ఆశయాలను ఆదర్శంగా తీసుకుని నైతిక విలువలతో కూడిన జీవితాన్ని అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు. విద్య కేవలం మార్కులకే పరిమితం కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాలని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎస్టీయూ మండల అధ్యక్షులు అక్కల నారాయణ, ఉపాధ్యాయ సంఘ నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM