Pakala: పాకల జెడ్పీ ఉన్నత పాఠశాలలో బిఐఎస్ క్లబ్ కిట్ల పంపిణీ
Pakala: ప్రకాశం జిల్లా పాకల జెడ్పీ పాఠశాలలో 30 మంది బిఐఎస్ స్టాండర్డ్ క్లబ్ విద్యార్థులకు టీ షర్టులు, క్యాపులు పంపిణీ. బిఐఎస్ విజయవాడ సంస్థకు హెచ్‌ఎం ధన్యవాదాలు.
Pakala: పాకల జెడ్పీ ఉన్నత పాఠశాలలో బిఐఎస్ క్లబ్ కిట్ల పంపిణీ
పాకల: బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(BIS) విజయవాడ, సంస్థ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, పాకల లో నిర్వహించబడుచున్న బిఐఎస్ స్టాండర్డ్ క్లబ్ లోని 30 మంది విద్యార్థుల కొరకు పంపించిన టీ షర్టులు, క్యాపులు మరియు రైటింగ్ పాడ్స్ ఈరోజు పాఠశాలలో పంపిణీ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాదు మరియు బిఐఎస్ క్లబ్ మెంటార్ డి.విజయానంద్, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు పి. ప్రసాద్ మాట్లాడుతూ "పాఠశాల బిఐఎస్ క్లబ్ చేపడుతున్న కార్యక్రమాలు ఉత్పత్తుల నాణ్యత, ప్రమాణాల అవగాహనకు ఎంతగానో తోడ్పడుతున్నాయని,
బిఐఎస్ క్లబ్ విద్యార్థుల కొరకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారు అందిస్తున్న సహకారం మరువలేనిది" అని కొనియాడారు.




