Pakala: పాకాల బీచ్‌లో పెను విషాదం: సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి

Pakala: ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాల బీచ్‌లో సముద్ర స్నానానికి వెళ్లి రాకాసి అలకు గురై ఐదుగురు ప్రాణాలు కోల్పోగా, శ్రీరంగపురంలో విషాదం అలముకుంది.

Ram Mohan, Singarayakonda
Published on: 10 Oct 2026 4:12 PM IST
Pakala
X

Pakala: పాకాల బీచ్‌లో పెను విషాదం: సముద్ర స్నానానికి వెళ్లి ఐదుగురు మృతి

ప్రకాశం జిల్లా: సింగరాయకొండ మండలం పాకాల బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. కనిగిరి నియోజకవర్గంలోని శ్రీరంగపురం గ్రామానికి చెందిన 15 మంది పోలేరమ్మ తల్లి పొంగల్‌ అనంతరం సముద్ర స్నానం చేసేందుకు పాకాల బీచ్‌కు వెళ్లారు. ఈ క్రమంలో ఒక్కసారిగా పెద్ద అల రావడంతో ఏడుగురు సముద్రంలో గల్లంతయ్యారు.

వెంటనే అప్రమత్తమైన మెరైన్‌ సిబ్బంది ఐదుగురిని రక్షించి ఒడ్డుకు చేర్చారు. అయితే, వారిలో ఒకరు అప్పటికే మృతి చెందగా, తీవ్ర అస్వస్థతకు గురైన మరో నలుగురిని 108 అంబులెన్స్‌లో కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరో ఇద్దరు మృతి చెందారు. ప్రస్తుతం ఇద్దరికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

ఇదిలా ఉండగా, సముద్రంలో గల్లంతైన మరో ఇద్దరి ఆచూకీ తెలియాల్సి ఉంది. ఒకే గ్రామానికి చెందిన వారు సముద్ర స్నానానికి వెళ్లి ప్రమాదానికి గురికావడంతో శ్రీరంగపురం గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Ram Mohan, Singarayakonda

Ram Mohan, Singarayakonda