Ongole: ఘనంగా గాంధీ జయంతి రూ.68.12 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

Ongole: ఒంగోలులో గాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. మంత్రి డోలా స్వామి, ఎంపీ మాగుంట, ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ 120 మందికి సీఎంఆర్‌ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 2 Oct 2026 7:33 PM IST
Ongole
X

Ongole: ఘనంగా గాంధీ జయంతి రూ.68.12 లక్షల సీఎంఆర్‌ఎఫ్ చెక్కుల పంపిణీ

ఒంగోలు: జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి సందర్భంగా ఒంగోలులో ఘనంగా నివాళులర్పించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్యలతో కలిసి ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ రావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

సత్యం, అహింస, శాంతి, సామాజిక సమానత్వం వంటి గాంధీజీ ఆశయాలను నేటి తరాలు ఆదర్శంగా తీసుకోవాలని ఈ సందర్భంగా వారు పిలుపునిచ్చారు.

అనంతరం ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) ద్వారా 120 మంది లబ్ధిదారులకు రూ.68 లక్షల 12 వేల విలువైన చెక్కులను మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యేలు పంపిణీ చేశారు. ఆపదలో ఉన్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు ముఖ్యమంత్రి సహాయ నిధి అండగా నిలుస్తోందని, ప్రజల సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని నాయకులు పేర్కొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.