Kondapi: ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి డోలా

Kondapi: ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక అని, ఆయన ఆశయాల సాధనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా పేర్కొన్నారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 22 Sept 2026 7:47 PM IST
Kondapi
X

Kondapi: ఎన్టీఆర్ తెలుగుజాతి ఆత్మగౌరవ ప్రతీక: మంత్రి డోలా

కొండపి: ఎన్టీఆర్‌ అంటే మూడక్షరాల పేరు కాదని, తెలుగుజాతి ఆత్మగౌరవానికి ప్రతీక అని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. కొండపి మండలం పెడకండ్లకుంటలో మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమం మంగళవారం ఘనంగా జరిగింది. మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, సీనియర్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు, మారిటైం బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా విగ్రహాలను ఆవిష్కరించి పూలమాలలు వేసి నివాళులర్పించిన మంత్రి డోలా మాట్లాడుతూ.. పేదలకు కిలో బియ్యం రెండు రూపాయలకే అందించడం, పక్కా ఇళ్లు, జనతా వస్త్రాలు, ఆస్తిలో మహిళలకు సమాన వాటా వంటి విప్లవాత్మక నిర్ణయాలతో ఎన్టీఆర్‌ పేదల సంక్షేమానికి విశేష కృషి చేశారని అన్నారు. తెలుగుజాతి శక్తిని ప్రపంచానికి చాటిన ఎన్టీఆర్‌ కీర్తి చిరస్థాయిగా నిలిచిపోతుందని పేర్కొన్నారు.

మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు కొండపి ప్రాంత ప్రజలకు ఎమ్మెల్యేగా, మంత్రిగా అందించిన సేవలు చిరస్మరణీయమని మంత్రి అన్నారు. రోడ్లు, బ్రిడ్జిల నిర్మాణంతో ప్రజలకు రవాణా సౌకర్యాలు మెరుగుపరిచారని, దశాబ్దాల సమస్యలకు పరిష్కారం చూపారని తెలిపారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేసి నీటిని అందించామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల మేరకు సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తున్నామని, పరిశ్రమలు, పెట్టుబడులు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని అన్నారు.

ఉపాధ్యాయులపై దాడులు చేయడం దుర్మార్గమని మంత్రి విమర్శించారు. తప్పుడు ప్రచారాలు, కుట్రలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ, ప్రజా క్షేత్రంలో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగాలని మంత్రి ఆకాంక్షించారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.