Yerragondapalem: ఐదు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Srikanth Singam, Markapur
Published on: 21 Oct 2026 1:14 PM IST
Yerragondapalem
X

Yerragondapalem: ఐదు మండలాల్లోని ఎంపీడీవో కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు!

Yerragondapalem: మార్కాపురం జిల్లా ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో పెద్దారవీడు, త్రిపురాంతకం, పుల్లలచెరువు, పెద్ద దోర్నాల, ఎర్రగొండపాలెం లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానిక ఎన్నికల సందడి మొదలైంది. మండల పరిషత్ కార్యాలయాల వద్ద నామినేషన్ల స్వీకరణ ప్రారంభం కావడంతో ఆయా ప్రాంతాల్లో ఎన్నికల కోలాహలం నెలకొంది.

నామినేషన్ల దాఖలుకు అభ్యర్థులు, రాజకీయ నాయకులు సిద్ధమవుతుండటంతో ఎన్నికల ప్రక్రియపై ఆసక్తి నెలకొంది. నామినేషన్ల స్వీకరణ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు అవసరమైన చర్యలు చేపడుతున్నారు.

ఎన్నికల నిబంధనలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేలా అభ్యర్థులు, రాజకీయ నాయకులు, ప్రజలు పోలీసులకు సహకరించాలని సూచించారు.

Srikanth Singam, Markapur

Srikanth Singam, Markapur