Santhanuthalapadu: సంతనూతలపాడులో మరో నాలుగు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం!

Santhanuthalapadu: ప్రకాశం జిల్లా శాస్త్రవేత్త రామకోటి వెంకటరమణ ఆధ్వర్యంలో మరో నాలుగు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండ్లు, కూరగాయల సాగుకు శ్రీకారం చుట్టారు.

G.V. Naresh Kumar, Prakasam
Published on: 27 Sept 2026 5:55 PM IST
Santhanuthalapadu
X

Santhanuthalapadu: సంతనూతలపాడులో మరో నాలుగు ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం!

Santhanuthalapadu: సంతనూతలపాడు కు చెందిన ప్రముఖ శాస్త్రవేత్త రామకోటి వెంకటరమణ ఆధ్వర్యంలో గత ఎనిమిది సంవత్సరాల నుండి సంతనూతలపాడులో ప్రకృతి వ్యవసాయం ద్వారా పంటలను సాగు చేస్తున్నారు. మరొక నాలుగు ఎకరాల్లో సంతనూతలపాడు శాస్త్రవేత్త వెంకటరమణ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ద్వారా పండ్లు, కూరగాయలు సాగు.

సమీపంలోని తన చేనులో ఆదివారం నాడు ప్రకృతి వ్యవసాయం ద్వారా పండ్లు, కూరగాయలు, ఆకుకూరలను సాగు చేయాలని ఉద్దేశంతో 15 రకాల విత్తనాలతో (పి. ఎం. డి. ఎస్) బోజా మృతంతో విత్తన శుద్ధి చేసి విత్తనాలను పొలంలో వెద జల్లారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రకృతి వ్యవసాయ యూనిట్ ఇన్చార్జి పి. శేషమ్మ, రైతు శాస్త్రవేత్త వెంకటరమణ, ఐ .సి .ఆర్. పి .లు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు ఇవ్వనున్నవి.

G.V. Naresh Kumar, Prakasam

G.V. Naresh Kumar, Prakasam