Markapuram: మార్కాపురంలో మున్సిపల్ పోలింగ్ అభ్యర్థుల ఓటు హక్కు!

Markapuram: మార్కాపురం పట్టణంలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్. ఓటు హక్కు వినియోగించుకున్న చైర్మన్ అభ్యర్థులు వక్కలగడ్డ మల్లికార్జునరావు, చెప్పల్లి కనకదుర్గ.

SREENIVAS YANNAM, MARKAPURAM
Published on: 1 Nov 2026 8:26 AM IST
Markapuram
X

Markapuram: మార్కాపురంలో మున్సిపల్ పోలింగ్ అభ్యర్థుల ఓటు హక్కు!

Markapuram: మార్కాపురం పట్టణంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు చేరుకుంటున్నారు. దీంతో పట్టణంలో ఎన్నికల సందడి నెలకొంది.

మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ అభ్యర్థిని చెప్పల్లి కనకదుర్గ రెడ్డి కాలేజీ వద్ద తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి ఒక్కలగడ్డ మల్లికార్జునరావు సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని చాటుతూ ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుండటంతో ఎన్నికల ఫలితాలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.

SREENIVAS YANNAM, MARKAPURAM

SREENIVAS YANNAM, MARKAPURAM