Peddaraveedu: పెద్దారవీడు మండల ఎంపీపీ పదవి ఓసీ (OC) మహిళకు రిజర్వు.
Peddaraveedu: ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్సీపీలో పోటీ పెరిగింది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎవరికి అవకాశం ఇస్తారన్నదానిపై ఉత్కంఠ.
Peddaraveedu: పెద్దారవీడు మండల ఎంపీపీ పదవి ఓసీ (OC) మహిళకు రిజర్వు.
Peddaraveedu: పెద్దారవీడు మండల ఎంపీపీ పదవి ఓసీ మహిళకు రిజర్వ్ కావడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయ సందడి నెలకొంది. ఎంపీపీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు పలువురు నాయకులు తమ కుటుంబ సభ్యులను రంగంలోకి దింపేందుకు ఆసక్తి చూపుతుండటంతో ఆశావహుల సంఖ్య పెరుగుతోంది. అయితే, పార్టీ అధిష్ఠానం, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
ఆశావహుల జాబితాలో ప్రముఖ పేర్లు!
మాజీ ఎంపీపీ ఏరువా భాగ్యలక్ష్మి, వైసీపీ జిల్లా అధికార ప్రతినిధి ఏలూరి వెంకట నారాయణరెడ్డి కుమార్తె, ప్రముఖ డాక్టర్, తోకపల్లి మాజీ సర్పంచ్ జిల్లెల మల్లేశ్వరి, పుచ్చకాయపల్లి గ్రామానికి చెందిన సీనియర్ నాయకుడు మారం రెడ్డి రామస్వామిరెడ్డి కుటుంబం తరఫున అభ్యర్థిని బరిలోకి దింపే అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది.
ఎంపీపీ పదవిని దక్కించుకునేందుకు ఆశావహులు తమదైన శైలిలో ప్రయత్నాలు సాగిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ అవకాశం కల్పిస్తే ఎంపీపీ స్థానాన్ని గెలుచుకుని పార్టీకి కానుకగా అందిస్తామని ఆశావహుల వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.
ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నిర్ణయమే కీలకం!
ప్రస్తుతం తెరపైకి వచ్చిన పేర్లతో పాటు రానున్న రెండు రోజుల్లో మరికొందరు ఆశావహులు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. చివరకు ఎవరికి అవకాశం దక్కుతుంది? ఎమ్మెల్యే ఎవరికి గ్రీన్సిగ్నల్ ఇస్తారు? అన్న ప్రశ్నలు వైసీపీ శ్రేణుల్లో ఉత్కంఠ రేపుతున్నాయి. పెద్దారవీడు మండల ఎంపీపీ అభ్యర్థి ఎంపిక వైసీపీలో ఎలాంటి రాజకీయ పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.




