Prakasham: తౌషీక్, మౌలాబీ మరణాలతో నాకు సంబంధం లేదు ఎంపీ మాగుంట స్పష్టత

Prakasham: తౌషీక్, మౌలాబీ మరణాల ఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని, పూర్తిస్థాయి దర్యాప్తు జరపాలని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు.

Showry Doas, Staff Reporter -Ongole
Published on: 10 Oct 2026 4:05 PM IST
Prakasham
X

Prakasham: తౌషీక్, మౌలాబీ మరణాలతో నాకు సంబంధం లేదు ఎంపీ మాగుంట స్పష్టత

ప్రకాశం జిల్లా: తౌషీక్, మౌలాబీ మరణాల ఘటనలతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఘటనలకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించారు. శింగరాయకొండలోని శ్రీ చైతన్య నవోదయ విద్యాసంస్థతో తనకు ఎలాంటి సంబంధం లేదని, ఆ సంస్థ యాజమాన్యాన్ని కాపాడాల్సిన అవసరం కూడా తనకు లేదని పేర్కొన్నారు.

విద్యార్థి తౌషీక్ మృతిని ఆత్మహత్యగా చిత్రీకరించడంలో తన పాత్ర ఉందంటూ ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ చేస్తున్న ఆరోపణలు అవాస్తవమని మాగుంట తెలిపారు. విద్యార్థి మృతి కేసును తారుమారు చేసేందుకు తాను ఎవరికీ సిఫార్సు చేయలేదని స్పష్టం చేశారు.

తమ కుటుంబం దివంగత మాగుంట సుబ్బరామిరెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు రాజకీయాల్లో ఉందని, ప్రజలకు సేవ చేయడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు. ప్రజల ఆదరణ, ఆశీస్సులతో మూడు దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో కొనసాగుతూ సేవలందిస్తున్నామని తెలిపారు. తమ కుటుంబంపై ఆరోపణలు చేసే ముందు కుటుంబ నేపథ్యాన్ని తెలుసుకోవాలని సూచించారు.

తౌషీక్ మరణంపై పూర్తిస్థాయి దర్యాప్తు జరిపి, ఘటనకు సంబంధించిన వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని మాగుంట శ్రీనివాసులు రెడ్డి కోరారు.

Showry Doas, Staff Reporter -Ongole

Showry Doas, Staff Reporter -Ongole

రెండు దశాబ్దాలకు చేరువగా (16 ఏళ్లు) క్షేత్రస్థాయి అనుభవంతో, ఒంగోలు మరియు ప్రకాశం జిల్లా రాజకీయ, సామాజిక పరిణామాలపై నిశిత పరిశీలన కలిగిన ‘సీనియర్ స్టాఫ్ రిపోర్టర్’.