Chirala: చీరాలలో ముమ్మరంగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం!
Chirala: బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో కూటమి అభ్యర్థుల తరఫున మహేంద్రనాథ్ ప్రచారం చేపట్టారు.
Chirala: చీరాలలో ముమ్మరంగా కూటమి అభ్యర్థుల ఎన్నికల ప్రచారం!
Chirala: చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య ఆధ్వర్యంలో చీరాల పట్టణ స్థానిక 12 వార్డుల నందు దుర్గమ్మ విగ్రహం వద్ద పూజలు నిర్వహించి ఆశీస్సులు పొందిన అనంతరం, చీరాల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేంద్ర నాథ్ స్థానిక కూటమి అభ్యర్థి గోలి స్వాతి , కూటమి పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం ఎలా పరుగులు పెడుతున్నాయో మీరంతా చూస్తున్నారు. ఇదే అభివృద్ధి ప్రతి వార్డుకు నేరుగా చేరాలంటే రాబోయే మున్సిపాలిటీ ఎన్నికల్లో కూటమి నాయకులను ఆశీర్వదించండి. కూటమి బలపరిచిన అభ్యర్థులను అత్యధిక మెజారిటీతో గెలిపించి, మన ప్రాంతాల అభివృద్ధికి ప్రజలే శ్రీకారం చుట్టాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
ఈ సందర్భంగా స్థానిక నాయకులు మాట్లాడుతూ.. చీరాల పట్టణం అన్ని రంగాల్లో అగ్రగామిగా నిలవాలన్నా, ఎలాంటి రాజకీయ రగడలు లేని ప్రశాంతమైన సుందరమైన పట్టణంగా రూపుదిద్దుకోవాలన్నా కూటమి ప్రభుత్వ అభ్యర్ధుల గెలుపు ఎంతో కీలకమని అభిప్రాయపడ్డారు.
ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య నాయకత్వంలో చీరాల మున్సిపాలిటీలో చైర్మన్ పీఠంతో పాటు మెజారిటీ కౌన్సిలర్ స్థానాలను కూటమి పార్టీలు ఘనవిజయం సాధిస్తాయని స్థానిక ప్రజలు ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించడంతో ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది
కార్యక్రమంలో కూటమి కౌన్సిలర్ అభ్యర్థి స్వాతి గోలి , స్థానిక ప్రముఖులు, కూటమి పార్టీల నాయకులు, మిత్రపక్షాల నేతలు మరియు మహిళా నాయికలు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొన్నారు.




