Podili: పొదిలిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన!

Podili: మార్కాపురం జిల్లా పొదిలిలో 6, 8 వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి బుధవారం శంకుస్థాపన చేశారు.

MADARVALI, MARKAPURAM
Published on: 30 Sept 2026 3:18 PM IST
Podili
X

Podili: పొదిలిలో సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన!

Podili: మార్కాపురం జిల్లా పొదిలి పట్టణ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ముందుకు సాగుతున్నారని స్థానిక టీడీపీ నాయకులు తెలిపారు. ఇందులో భాగంగా పొదిలి నగరపంచాయతీ పరిధిలోని 6వ, 8వ వార్డుల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి బుధవారం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.

ఎన్నో ఏళ్లుగా మట్టి రోడ్లతో ఇబ్బందులు పడుతున్న ఆయా వార్డుల ప్రజలకు సీసీ రోడ్ల నిర్మాణంతో ఉపశమనం కలగనుంది. ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ప్రత్యేక చొరవతో పొదిలి పట్టణంలోని పలు ప్రాంతాల్లో సీసీ రోడ్లు, సైడ్ కాలువలు, కల్వర్టుల నిర్మాణ పనులు చేపడుతున్నట్లు నాయకులు తెలిపారు.

శంకుస్థాపన కార్యక్రమానికి విచ్చేసిన ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి స్థానిక టీడీపీ నాయకులు, మహిళలు ఘన స్వాగతం పలికారు. తమ ప్రాంతాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డికి, స్థానిక నాయకులకు ప్రజలు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. పట్టణంలోని మిగిలిన సమస్యలను కూడా పరిష్కరించి అభివృద్ధి పనులను కొనసాగించాలని స్థానికులు కోరారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM