Markapur: మార్కాపురంలో వార్ వన్ సైడ్ ఎమ్మెల్యే కందుల ధీమా!
Markapur: మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడేనని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధీమా. జవహర్ నగర్ కాలనీలో ఓటు వేసిన ఎమ్మెల్యే, కూటమి గెలుపుపై ఆశాభావం.
Markapur: మార్కాపురంలో వార్ వన్ సైడ్ ఎమ్మెల్యే కందుల ధీమా!
Markapur: మార్కాపురం జిల్లా మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో వార్ వన్ సైడ్‌గా ఉంటుందని, కూటమి అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున విజయంపై పూర్తి విశ్వాసం ఉందని మార్కాపురం ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
మార్కాపురం పట్టణంలోని జవహర్ నగర్ కాలనీలో ఉన్న మున్సిపల్ పాఠశాలలో ఏర్పాటు చేసిన 37/1 పోలింగ్ బూత్‌లో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి తన తల్లితో కలిసి వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు, వెలుగొండ ప్రాజెక్టు పూర్తి, మార్కాపురం జిల్లాగా ఏర్పాటు వంటి నిర్ణయాలతో పట్టణ ప్రజలు ప్రభుత్వంపై తమ అభిమానం చూపిస్తున్నారని పేర్కొన్నారు.
ఈ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రజలు తమ ఓటు ద్వారా మద్దతు తెలుపుతారని ఆశాభావం వ్యక్తం చేశారు. మార్కాపురం మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి వక్కలగడ్డ మల్లికార్జున ఘన విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి ధీమా వ్యక్తం చేశారు.




