Kandukur: చిల్లర మాటలొద్దు: వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఇంటూరి వార్నింగ్
Kandukur: వైసీపీ నేతలు చిల్లర మాటలు మానుకోవాలని కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు హెచ్చరించారు. రెండేళ్లలో చేపట్టిన అభివృద్ధి పనులను వివరించారు.
Kandukur: చిల్లర మాటలొద్దు: వైసీపీ నేతలకు ఎమ్మెల్యే ఇంటూరి వార్నింగ్
ప్రకాశం జిల్లా: కందుకూరు లోని టిడిపి కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు.
మీడియాతో మాట్లాడుతూ.. వైసీపీ నేతలు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని, వారి నుంచి తాను రాజకీయం నేర్చుకోవాల్సిన అవసరం లేదన్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో రూ.81 కోట్లతో 90 కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మించామని తెలిపారు. 22ఏ సమస్యలో ఉన్న గర్భకండ్రిక, ఎంఐజీ లేఅవుట్, నాలుగో తరగతి ఉద్యోగుల కాలనీ భూములను క్లియర్ చేయించామని చెప్పారు. కందుకూరు నియోజకవర్గాన్ని తిరిగి ప్రకాశం జిల్లాలో కలిపిన ఘనత కూటమి ప్రభుత్వానిదేనన్నారు.
సీఎంఆర్‌ఎఫ్ ద్వారా 43 విడతల్లో 1,655 మందికి రూ.12.6 కోట్లు అందించామని తెలిపారు. రాళ్లపాడు ప్రాజెక్టులో నీరు తగ్గిన నేపథ్యంలో సోమశిల నుంచి నీటిని విడుదల చేయాలని సీఎంను కోరగా సానుకూలంగా స్పందించారని చెప్పారు.
వెలిగొండ నీటిని కందుకూరు వరకు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని, రామాయపట్నం పోర్టు సమీపంలో 1,500 ఎకరాల్లో పెట్రోకెమికల్ పార్కు ఏర్పాటు కానుందని ఎమ్మెల్యే తెలిపారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను గెలిపించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.




