Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో రూ.5 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో పల్లె పండుగ 3.0 కింద రూ.5 కోట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి ప్రారంభించారు.
Giddalur: గిద్దలూరు నియోజకవర్గంలో రూ.5 కోట్లతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
గిద్దలూరు: కంభం మండలాన్ని అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన పల్లె పండుగ 3.0 కార్యక్రమంలో భాగంగా సుమారు రూ.5 కోట్ల వ్యయంతో చేపట్టనున్న పలు సీసీ రోడ్లు, తారు రోడ్ల నిర్మాణ పనులకు గిద్దలూరు ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి శంకుస్థాపన చేసి, భూమిపూజ నిర్వహించి పనులను ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా జంగంగుంట్ల గ్రామంతో పాటు కంభం పట్టణంలోని రైల్వే స్టేషన్ నుంచి అర్బన్ కాలనీ వరకు, హజరత్ గూడెం నుంచి అంకాలమ్మ గుడి వరకు అంతర్గత సీసీ రోడ్లు, కందులాపురం నుంచి రావిపాడు వరకు, హజరత్ గూడెం నుంచి రావిపాటి హైవే వరకు తారు రోడ్ల నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఎన్నో ఏళ్లుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న రహదారి సమస్యల పరిష్కారానికి పనులు ప్రారంభం కావడంతో స్థానిక ప్రజలు, మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అశోక్ రెడ్డిని పూలమాలలతో ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రహదారి సౌకర్యాలను మెరుగుపరిచి ప్రజలకు రవాణా ఇబ్బందులు తగ్గించడమే ఈ అభివృద్ధి పనుల ప్రధాన లక్ష్యం అని ఎమ్మెల్యే అన్నారు. కార్యక్రమంలో కంభం మండలం ప్రముఖులు, కూటమి నాయకులు,కార్యకర్తలు,అభిమానులు తదితరులు పాల్గొన్నారు




