Addanki: అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవి, అనిత పర్యటన.. పలు ప్రారంభాలు

Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, వంగలపూడి అనిత పర్యటించి.. రూ.7.72 కోట్ల సబ్‌స్టేషన్, అగ్నిమాపక కేంద్రాలను ప్రారంభించారు.

Kolla Singaiah, Addanki
Published on: 17 Sept 2026 2:57 PM IST
Addanki
X

Addanki: అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవి, అనిత పర్యటన.. పలు ప్రారంభాలు

ప్రకాశం జిల్లా: అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవి, హోం మంత్రి వంగలపూడి అనిత పర్యటించారు. అద్దంకి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలను మంత్రులు ప్రారంభించారు.

పట్టణంలోని NSP కాలనీలో రూ.7.72 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ ఇండోర్ సబ్ స్టేషన్ ను మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనిత ప్రారంభించారు.

సింగరకొండలో శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్ , అనిత ప్రత్యేక పూజలు నిర్వహించారు

అద్దంకిలో కొత్తగా రూ.2.25 కోట్లతో నిర్మించిన అగ్నిమాపక కేంద్రాన్ని, రూ. 75 లక్షల విలువైన అగ్నిమాపక వాహనాన్ని మంత్రులు గొట్టిపాటి రవికుమార్ వంగలపూడి అనిత ప్రారంభించారు.

Kolla Singaiah, Addanki

Kolla Singaiah, Addanki