Addanki: అద్దంకిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి!
Addanki: ప్రకాశం జిల్లా అద్దంకిలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్.. స్థానికుల సమస్యలను అడిగి తెలుసుకొని, పలు అభివృద్ధి పనులను పరిశీలించారు.
Addanki: అద్దంకిలో పర్యటించి ప్రజల సమస్యలు తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి!
Addanki: అద్దంకి పట్టణంలో పర్యటించిన మంత్రి గొట్టిపాటి బట్టి బడి , బలిజిపాలెం , గుర్రాల కాలనీల్లో ప్రజల సమస్యలను మంత్రి గొట్టిపాటి అడిగి తెలుసుకున్నారు. కాలనీల్లో ప్రజారోగ్యం, పారిశుధ్య పనులపై దృష్టి సారించాలని మంత్రి మున్సిపల్ అధికారులకు ఆదేశం నిచ్చారు
ప్రజలకు తాగునీరు, రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేయాలని అధికారులకు సూచనలు ఇచ్చారు . కొత్తగా నిర్మించనున్న ఇండోర్ స్టేడియం, జిమ్ నిర్మాణ ప్రాంతాలను మంత్రి పరిశీలించారు. ఇండోర్ స్టేడియం, జిమ్ నిర్మాణాలపై అధికారులతో మాట్లాడి ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేయాలని మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఆదేశనిచ్చారు.




