Prakasam: సజ్జాపురంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
Prakasam: సంతమాగులూరు మండలం సజ్జాపురంలో రూ. 4.70 కోట్ల సబ్‌స్టేషన్, పీఎం సూర్యఘర్ పనులను ప్రారంభించి, రూ. 47.83 లక్షల CMRF చెక్కులను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు.
Prakasam: సజ్జాపురంలో అభివృద్ధి పనులను ప్రారంభించిన మంత్రి గొట్టిపాటి
ప్రకాశం జిల్లా: సంతమాగులూరు మండలం లో మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పర్యటించి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.సజ్జాపురం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో గాంధీ జయంతి వేడుకలలో మంత్రి విద్యార్థులతో కలిసి పాల్గొన్నారు.
సజ్జాపురం గ్రామంలోని ఎస్సీ కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని మంత్రి గొట్టిపాటి ప్రారంభించారు.సజ్జాపురం గ్రామంలో రూ. 4.70 కోట్లతో నిర్మించిన 33/11 కేవీ సబ్‌స్టేషన్ ను మంత్రి ప్రారంభించారు.
అనంతరం మండలంలోని పుట్టావారిపాలెం క్యాంపు కార్యాలయంలో నియోజవర్గంలోని ఐదు మండలాలు కు చెందిన 89 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల మంత్రి గొట్టిపాటి రవికుమార్ పంపిణీ చేశారు.
రూ.47.83 లక్షలకు సంబంధించిన ఎల్ఓసీల చెక్కులను మంత్రి గొట్టిపాటి పంపిణీ చేశారు. అనంతరంమీడియాతో మంత్రి మాట్లాడుతూ .. గ్రామ అభివృద్ధికి కూటమి ప్రభుత్వం కృషి చేస్తుంది అన్నారు అందుకు మండలంలోని గ్రామాల గ్రామాల నూతన లింక్ రోడ్లను ఏర్పాటు చేశామన్నారు.
నూతన పింఛను విషయంలో ప్రభుత్వం విడతల వారీగా అర్హులకు అందజేస్తుందన్నారు , నియోజవర్గంలో లో వోల్టేజ్ విద్యుత్ సమస్య లేకుండా అందుబాటులో సబ్స్టేషన్లో ఏర్పాటు చేశామన్నారు. కూటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను ఓర్వలేక వైసీపీ నాయకులు తప్పుడు ప్రచారాన్ని చేస్తున్నారన్నారు.




