Bapatla: రేపల్లెలో ఘనంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు!
Bapatla: రేపల్లెలో అక్టోబర్ 1న సీఎం చంద్రబాబు నాయుడు పర్యటన ఏర్పాట్లను అధికారులతో కలిసి పరిశీలించిన రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్. వివరాలు.
Bapatla: రేపల్లెలో ఘనంగా ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ ఏర్పాట్లు!
Bapatla: అన్ని శాఖల అధికారులు,ప్రజా ప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేసి ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్య ప్రసాద్ తెలిపారు.
అక్టోబర్ 1న గురువారం రేపల్లె పట్టణంలో నిర్వహించనున్న “పేదల సేవలో ఎన్టీఆర్ భరోసా” సామాజిక భద్రత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొననున్న నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్లను సోమవారం జిల్లా ఎస్పీ ఉమామహేశ్వర్,
జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్, ఎమ్మెల్సీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యటనల సమన్వయకర్త పి.వెంకటేష్ లతో కలసి రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ పరిశీలించారు.
రేపల్లె పట్టణంలో ముఖ్యమంత్రి పర్యటనలో భాగంగా ఏర్పాటు చేస్తున్న హెలీప్యాడ్, ప్రజా వేదిక, క్యాడర్ సమావేశ ప్రాంగణం తదితర ప్రాంతాలను మంత్రి పరిశీలించారు.
కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, పార్టీ శ్రేణులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
భద్రతా ఏర్పాట్లు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, వేదిక నిర్మాణం, ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు తదితర అంశాలపై అధికారులకు చూచానులు చేశారు.
ముఖ్యమంత్రి పర్యటనను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలు, ప్రజా ప్రతినిధులు అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో రేపల్లె, చీరాల,బాపట్ల, ఆర్డీఓ లు బి.శ్రీదేవి,నరసింహా రావు,ఏ.హరి కుమార్,మున్సిపల్ కమిషనర్ సాంబశివరావు, డిఎస్పీ అబ్దుల్ అజీజ్, డిఆర్డీఏ, మెప్మా,గృహ నిర్మాణ సంస్థ పి డి లు, బి.సింగయ్య, ఆనంద సత్య పాల్,వెంకటేశ్వరరావు, డి ఎస్ ఓ.జగన్మోహన్,
డి పి ఓ.యల్.ప్రభాకర్ రావు, స్వర్ణ గ్రామ - స్వర్ణ వార్డు జిల్లా అధికారి రాజేష్,గ్రామ వార్డు సచివాలయాల జిల్లా కోఆర్డినేటర్ యశ్వంత్, డి యల్ డి ఓ.పద్మావతి, ఆర్ & బి ఈ ఈ,డి ఈ లు,తహశీల్దార్, యం పి డి ఓ,కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.




