Cheemakurthi: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి గ్రానైట్ క్వారీ మూసివేత!
Cheemakurthi: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి కుటుంబానికి చెందిన గ్రానైట్ క్వారీని మూసివేయడం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
Cheemakurthi: వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి గ్రానైట్ క్వారీ మూసివేత!
Cheemakurthi: ప్రకాశం జిల్లా చీమకుర్తిలో గ్రానైట్ క్వారీపై మైనింగ్ అధికారుల చర్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. దర్శి ఎమ్మెల్యే, వైఎస్సార్‌సీపీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి కుటుంబానికి చెందిన శ్రీ సూర్య గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించి.. సర్వే చేపట్టారు. నిబంధనల ఉల్లంఘనలు ఉన్నాయంటూ భారీ జరిమానాలు విధించినట్లు సమాచారం.
అయితే ఈ చర్యలపై బూచేపల్లి వర్గీయులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని.. కేవలం తమ క్వారీలనే టార్గెట్ చేసి తనిఖీలు నిర్వహించారని ఆరోపిస్తున్నారు. క్వారీ నిర్వహణలో ఇబ్బందులు తలెత్తడంతో కార్మికులకు చెల్లింపులు పూర్తి చేసి క్వారీని నిలిపివేసినట్లు చెబుతున్నారు.
మరోవైపు శ్రీ సూర్య గ్రానైట్ క్వారీలు, పాలిషింగ్ ఫ్యాక్టరీలపై ప్రభావంతో 350 మందికి పైగా కార్మికులు ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు. ఇదే సమయంలో నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడుతున్న ఇతర గ్రానైట్ క్వారీలపై మైనింగ్ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. ఈ వ్యవహారంపై అధికారుల చర్యలు, బూచేపల్లి వర్గీయుల ఆరోపణలు ఇప్పుడు రాజకీయంగానూ చర్చనీయాంశంగా మారాయి.




